Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్
ఫార్ములా-ఈ రేస్ కేసుపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశాం
బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు
సెలబ్రిటీలను హెచ్చరించాం
హైదరాబాద్: ఈ-కార్ రేసింగ్ ఫార్ములా కేసుపై(Formula E race case) కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశామని తెలంగాణ సీఐడీ చీఫ్ చారు సిన్హా(Telangana CID Chief Charu Sinha) వెల్లడించారు. ఈ కార్ ఫార్ములా కేసులో త్వరలోనే ట్రయల్ కొనసాగుతోందని సీఐడీ చీఫ్ పేర్కొన్నారు. మైనింగ్ అక్రమాలపై దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చారు సిన్హా తెలిపారు.
బెట్టింగ్ యాపులకు ఎవరు ప్రచారం చేసిన చర్యలు తప్పవన్న చారు సిన్హా బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన సెలబ్రిటీలను హెచ్చరించామని సూచించారు. హెచ్సీఏ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. Formula E race బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించారు. ఈ-కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ రేస్ లో భారీ కుంభ కోణం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది.






