12 June, 2026 | 12:02 PM

Breaking News

నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •   పగిడిద్దరాజు ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే పాయం చేయూత   •  

చెన్నూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ లు వీరే

13-02-2026 01:57 PM

చెన్నూర్: మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులకు 107 మంది అభ్యర్థులు కౌన్సిలర్ పదవీ కోసం పోటీ పడ్డారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 18 మంది, బీఆర్ఎస్ నుంచి 18, బీజేపీ నుంచి 18, బీఎస్పీ నుంచి ఒకరు, సీపీఎం నుంచి ఒకరు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి ఐదుగురు, సీపీఐ నుంచి ముగ్గురు, జనసేన నుంచి నలుగురు, ఆప్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్లు 11 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. శుక్ర వారం చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిది టేబుల్స్ ఏర్పాటు చేసి అదనపు సిబ్బందితో కలిపి పది మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, 20 మంది కౌంటింగ్ సహాయకులు కలిసి రెండు రౌండ్లలో ఓట్లను లెక్కించారు. 

విజయం సాధించిన కౌన్సిలర్లు వీరే...

చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులలో మొదటి వార్డు కౌన్సిలర్ గా పూల స్రవంతి సతీష్ (స్వతంత్ర), రెండవ వార్డు కౌన్సిలర్ గా పెద్దింటి పద్మ శ్రీను (కాంగ్రెస్), మూడవ వార్డు కౌన్సిలర్ గా అంబటి శంకర్ (కాంగ్రెస్), నాలుగవ వార్డు కౌన్సిలర్ గా పెండ్యాల సాగర్ (కాంగ్రెస్), ఐదవ వార్డు కౌన్సిలర్ గా చెన్నూరి స్వప్న రాజేష్ (కాంగ్రెస్), ఆరవ వార్డు కౌన్సిలర్ గా నాయకపు వినయ్ (కాంగ్రెస్), ఏడవ వార్డు కౌన్సిలర్ గా కొప్పుల ప్రభాకర్ (బీఆర్ఎస్), ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ గా సుంకరి శిరీష (కాంగ్రెస్), తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గా సుద్దపల్లి సునిత సుశీల్ (కాంగ్రెస్), పదవ వార్డు కౌన్సిలర్ గా గర్రెపల్లి శాంతారాణి వెంకట నర్సయ్య (బీజేపీ), 11వ వార్డు కౌన్సిలర్ గా ఇమ్రాన్ (బీఆర్ఎస్), 12వ వార్డు కౌన్సిలర్ గా ఎండీ నజ్వా (కాంగ్రెస్), 13వ వార్డు కౌన్సిలర్ గా మంత్రి లక్ష్మణ్ (కాంగ్రెస్), 14వ వార్డు కౌన్సిలర్ గా మేడ స్రవంతి (బీఆర్ఎస్), 15వ వార్డు కౌన్సిలర్ గా కొమ్మెర విజయలక్ష్మీ సమ్మయ్య (కాంగ్రెస్), 16వ వార్డు కౌన్సిలర్ గా ముత్యాల రాజేశ్వరి రవి గౌడ్ (బీఆర్ఎస్), 17వ వార్డు కౌన్సిలర్ గా ఎండీ అజీమోద్దీన్ (కాంగ్రెస్), 18వ వార్డు కౌన్సిలర్ గా ఏతం శివకృష్ణ (బీజేపీ)లు విజయం సాధించారు. మున్సిపాలిటీలోని 18 వార్డులకు కాంగ్రెస్ నుంచి 18 మంది పోటీ పడగా 11 మంది కౌన్సిలర్లుగా విజయం సాధించగా, బీఆర్ఎస్ నుంచి 18 మందికి నలుగురు, బీజేపీ నుంచి 18 మందికి ఇద్దరు, ఇండిపెండెంట్లు 38 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. బీఎస్పీ, సీపీఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ), జనసేన, సీపీఐ, ఆప్ పార్టీల నుంచి అందరు ఓటమి చవిచూడగా ఇండిపెండెంట్లు 37 మంది అభ్యర్థులు ఓడిపోయారు.