19 May, 2026 | 7:50 PM

Breaking News

ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •   సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి   •   మహిళా సంఘాల నిధులపై శిక్షణ   •   సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు   •   మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి   •   వృద్ధుడి అదృశ్యం   •   సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్   •   శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు   •   ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు   •  

విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు

19-05-2026 06:42 PM

బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు సరిత

జవహర్ నగర్,(విజయక్రాంతి): విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని విద్యార్థులు వారి విద్య అభ్యసనంలో నైపుణ్యాలను అలవర్చుకోవాలని విద్యార్థులకు "అభ్యసనమే కూసు విద్య"(ప్రాక్టీస్ మేడ్ ఫర్ఫెక్ట్) అని బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు సరిత పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు సరిత మంగళవారం సందర్శించారు.

అనంతరం సమ్మర్ క్యాంపులో పాల్గొంటున్న విద్యార్థులు, ఎస్ఎస్సి ఫెయిల్ స్టూడెంట్స్ కి నిర్వహిస్తున్న రెమిడీయల్ విద్యార్థులతో ముచ్చటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు విద్యా అభ్యసనంలో క్రమశిక్షణతో ముందుకు సాగాలని క్రమశిక్షణ మనిషిని ఉన్నత స్థానంలోకి తీసుకువస్తుందని, విద్యార్థులు తమ అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరచుకొని విద్యలో ఉన్నత స్థానాలకు చేరుకుంటేనే సమాజంలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో ఉన్న కంప్యూటర్ క్లాసులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న ఆహారం భోజన పదార్థాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు మహమ్మద్ అజముద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.