గణపతి మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు

16-09-2026 | 08:36pm

- అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇల్లెందు సీఐ తాటిపాముల సురేష్

ఇల్లెందు,(విజయక్రాంతి): పట్టణంలోని పలు వార్డుల్లో  గణపతి మండపాల్లో అన్నదాన కార్యక్రమాలు  మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతికి ప్రత్యేక పూజలను నిర్వహించి గణపతి ఆశీస్సులను గణపతి ఆశీస్సులను ప్రజలు పొందారు. పట్టణంలోని 19వ వార్డు సిక్కుల బజార్లో అన్నదాన కార్యక్రమాన్ని(annadana program) ఇల్లెందు సీఐ తాటిపాముల సురేష్(CI Tatipamula Suresh) ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి వేడుకలను(Vinayaka Chavithi celebrations) ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. ప్రథమ పూజలను అందుకునే వినాయకుడికి భక్తులందరూ నిష్టతో పూజలను నిర్వహిస్తే ఆ విగ్నేశ్వరుడు అన్ని విజ్ఞాలను తొలగించి ఆశీస్సులను అందిస్తాడని పేర్కొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు సిఐ తాటిపాముల సురేష్ ను శాలువాతో సన్మానించారు. అన్నదాన కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఏ టు జెడ్ శ్రీను, అయిత సత్యం, అంజి, మంగల్. వైభవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు