ఊకె శిరీషను కుటుంబానికి న్యాయం చేయాలి
మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.
కిరాతకంగా హత్య చేసిన దుండగులను పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలి.
- సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సత్య డిమాండ్
పాల్వంచ,(విజయక్రాంతి): హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రి నందు నర్సుగా పనిచేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ములకలపల్లి మండల ప్రాంత నివాసి అయిన ఊకె శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సత్యా(CITU District Assistant Secretary Satya) డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ పాల్వంచ శ్రామిక మహిళా పట్టణ కమిటి ఆధ్వర్యంలో ఊకె శిరీష(Uke Sirisha) చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి కొవ్వతులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు రోజురోజుకు రక్షణ లేకుండా పోతుందన్నారు.
పని ప్రాంతాల్లో పనిచేస్తున్న శ్రామిక మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను అమలు చేయకాపోవడం ఫలితంగానే ఇలాంటి సంఘటనలకు కారణమవుతున్నాయన్నారు. అశ్లీల సాహిత్యానికి, వీడియోలకు బానిసలుగా మారి క్రూర మృగాల్లాగా వ్యవహరిస్తున్న దుండగుల(Thugs) పట్ల కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శిరీషను అతికిరాతకంగా అత్యాచారం, హత్య చేసిన సనముల్లా ఖాన్, సంఘటనకు సహకరించిన వారందరినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.






