3 September, 2026 | 8:12 PM

చంచల్‌గూడలో స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం

03-09-2026 | 06:50pm

హైదరాబాద్: హైదరాబాద్ లో రెండో భారీ స్టీల్ ప్లైఓవర్(Steel flyover) ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM  Revanth Reddy ) గురువారం ప్రారంభించారు. రూ.620 కోట్ల వ్యయంతో నిర్మించిన చంచల్‌గూడ-సంతోష్ నగర్ స్టీల్ ఫ్లై ఓవర్(flyover) ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. చంచల్‌గూడ ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్(Chanchalguda Government Printing Press) నుంచి సంతోష్ నగర్(Santosh Nagar) వరకు మొత్తం 3.3 కిలో మీటర్ల పోడవు, 16.6 మీటర్ల వెడల్పుతో నాలుగు లైన్లుగా ఈ వంతెనను నిర్మించారు. ఈ ప్లై ఓవర్ నిర్మాణంతో  సంతోష్ నగర్, చంపాపేట, సైదాబాద్, చంచల్ గూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గనుంది.