3 September, 2026 | 6:45 PM

పోసానిపేట్ మీదుగా అన్నారం గ్రామానికి బస్సు సర్వీసు ప్రారంభం

03-09-2026 | 05:40pm

రామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి నుంచి అన్నారం గ్రామానికి(Annaram village) పోసానిపేట్ మీదుగా నూతన బస్సు సర్వీసు(Bus service)ను గురువారం ప్రారంభించారు. అన్నారం నుంచి కామారెడ్డికి కూడా ఇదే మార్గంలో బస్సు రాకపోకలు కొనసాగనున్నాయి. పోసానిపేట్ మీదుగా అన్నారం గ్రామానికి బస్సు సర్వీసును ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిపో మేనేజర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి బస్సు సర్వీసును ప్రారంభించారు.

ఈ బస్సు ప్రతిరోజు మధ్యాహ్నం 11:45 గంటలకు కామారెడ్డి(Kamareddy) నుంచి బయలుదేరి, పోసానిపేట్ మీదుగా అన్నారం చేరుకుని, తిరిగి అదే మార్గంలో కామారెడ్డికి చేరుకుంటుంది.ఈ సందర్భంగా గ్రామస్థులు బస్సుకు కొబ్బరికాయ కొట్టి సర్వీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుద్దాల లింగం, ఉప సర్పంచ్ అంజయ్య, మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఈ బస్సు సర్వీసును గ్రామ ప్రజలు, మహిళలు, యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ పెద్దలు కోరారు. బస్సు సర్వీసును ఏర్పాటు చేసిన డిపో మేనేజర్ మరియు సీఐ లింగమూర్తికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.