3 September, 2026 | 8:15 PM

అంగన్వాడీ కేంద్రాల్లోని సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి

03-09-2026 | 06:54pm

సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ 

ఘనంగా అక్షరాభ్యాస కార్యక్రమం 

గణపురం,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రత్యేకంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఒకటవ, బీసీ కాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాల లో భాగంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్పంచ్ రాధిక చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాలను కాపాడుకోవాలని తల్లులకు సూచించారు.