కరీంనగర్‌లో ఫ్లెక్సీ వార్
- గంగుల కు పోటీ గా కోమటిరెడ్డి
కరీంనగర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ వైఫల్యాలపై వారం రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా కట్టిన ఫ్లెక్సీ తియ్యనందుకు ప్రతిగా బిఆర్ఎస్(BRS) పై కరీంనగర్ లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula Kamalakar) అధికారిక క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Former SUD Chairman Komatireddy Narender Reddy) దాన్ని తొలగించాలని లేకపోతే బిఆర్ఎస్ పదేండ్ల పాలన వైఫల్యాల పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. బిఆర్ఎస్ నాయకులు ఆ ఫ్లెక్సీని తొలగించినందున ఇందిరా చౌక్ వద్ద ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ కూడలి వద్ద పదేళ్ల బిఆర్ఎస్ దోపిడీ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ల వార్ తో కరీంనగర్ లో రాజకీయం వేడెక్కింది.






