13 July, 2026 | 5:37 PM

Breaking News

జాతీయ నులిపురుగుల మాత్రల పంపిణీ   •   కళాకారుల విభాగం నియోజక వర్గం అధ్యక్షుడిగా ఎనగందుల దత్తు   •   గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన విద్యార్థులను అభినందనలు   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •  

రాములోరి కల్యాణానికి సీఎంకు ఆహ్వానం

24-03-2025 01:22 AM
  1. డిప్యూటీ సీఎంకూ పిలుపు
  2. అందజేసిన మంత్రి కొండా సురేఖ, భద్రాచలం ఆలయ అధికారులు

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్స వాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవస్థాన అర్చకులు, అధికారులు ఆహ్వానించారు.

ఆదివారం సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి తుమ్మలను హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో కలిసి ఆహ్వానపత్రాలు అందజే శారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రు లు ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ అభివృద్ధికి అవసరమైన భూ సేక రణ, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సీఎం, మంత్రులను కలిసిన వారిలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదా య శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు ఉన్నారు.