13 July, 2026 | 6:52 PM

జాతీయ నులిపురుగుల మాత్రల పంపిణీ

13-07-2026 05:35 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం  ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండాజోల్ (Albendazole) మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు విద్యార్థులకు నులిపురుగుల నివారణ, వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన ఆహారం తీసుకోవడం వంటి ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నులిపురుగుల నివారణ ద్వారా పిల్లల ఆరోగ్యం మెరుగుపడి, పోషకాహార లోపం తగ్గడంతో పాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ హర్షిన్, హోమియో వైద్యాధికారి డాక్టర్ సతీష్, హెల్త్ సూపర్వైజర్ పద్మ, హెల్త్ అసిస్టెంట్ ధర్మారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.