4 May, 2026 | 3:10 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

కేటీఆర్‌కు ఆ అర్హత లేదు

19-10-2024 01:07 PM

కేసీఆర్ కుటుంబానికి దోపిడి చరిత్ర ఉంది

హైడ్రా, మూసీ పునరుజ్జీవం వేర్వేరు

హైదరాబాద్: రాహుల్ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పదవులను త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానికి దక్కుతుంది. పదవులను గొప్ప వ్యక్తులకు ఇచ్చిన ఘనత సోనియా గాంధీ, రాహుల్ గాంధీకే దక్కుతుందని స్పష్టం చేశారు. నాలాలు, చెరువులను ఆక్రమించుకున్న వారే హైడ్రాను చూసి భయపడుతున్నారని చెప్పారు. హైడ్రాను చూసి రియల్ ఎస్టేట్ ను దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారని ఆరోపించారు. గండిపేటలో పేదల ఇళ్లు కట్టుకోలేదరు.. పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది నేతలు హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతియ్యాలని చూస్తున్నారని తెలిపారు. 

అజీజ్ నగర్ లో హరీశ్ రావు ఫాంహౌస్ లేదా..? కాంగ్రెస్ వల్లనే హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిందని సీఎం గుర్తుచేశారు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం వేర్వేరు అన్నారు. కేసీఆర్ కుటుంబానికి దోపిడి చరిత్ర ఉందని చెప్పిన ముఖ్యమంత్రి తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అజీజ్ నగర్ లో హరీశ్ రావు ఫాంహౌస్, జన్వాడలో కేటీఆర్ ఫాంహౌస్ లు కాపాడాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.