9 July, 2026 | 2:30 PM

జగదేవపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కరుణాకర్ నియామకం

09-07-2026 01:18 PM

జగదేవపూర్, (విజయక్రాంతి): జగదేవపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు(Congress Party President)గా జగదేవపూర్ మాజీ సర్పంచ్ కొంపెల్లి కరుణాకర్ కు గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నియామక పత్రాన్ని అందచేశారు. ఈ సందర్బంగా కరుణాకర్ మాట్లాడుతూ  అవకాశం కల్పించిన  నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని  అన్నారు. ఈ కార్యక్రమంలో డీ సీ సీ అధ్యక్షులు ఆంక్ష రెడ్డి,గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు చెరుకు లక్ష్మ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఇమ్మడి శివ లక్ష్మి,సర్పంచ్ లు ఓం ప్రకాష్, పద్మ రావు,నాయకులు అజిజ్, దయాకర్ రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.