విద్యా వ్యవస్థలో సమూల మార్పులు

12-09-2026 | 05:25am
  1. నైపుణ్య విద్యకు పెద్దపీట
  2. అందుకే విద్యా కమిషన్ ఏర్పాటు 
  3. పేదల మేలుకే విద్యా శాఖ నా వద్ద  
  4. నాణ్యమైన విద్య, పౌష్టికాహారం
  5. విదేశీ యూనివర్సిటీలకు తెలంగాణలో చోటు  
  6. విద్యార్థులు, టీచర్లు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దు 
  7. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): రాష్ట్ర విద్యా వ్యవస్థను సమూల  మా ర్పులు చేసి.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని, ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం అభివృద్ధి చెందాలంటే విద్యకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం పేర్కొన్నారు. అందుకోసమే విద్యారంగానికి బడ్జె ట్‌ను 15 శాతం పెంచనున్నట్లు వెల్లడించారు.

గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు విద్యను విస్తరించేందుకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి గూడెం, గ్రామంలో సింగిల్ టీచర్ పాఠశాలలు, ప్రాథమిక విద్య అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి 3 కిలోమీటర్లకు ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్లకు  ఉన్నత పాఠశాల, 10 కిలో మీ టర్లకు హైస్కూల్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మండలానికో జూనియర్ కాలేజీ, ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ, రెవె న్యూ డివిజన్లలో ఇంజినీరింగ్, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు రావాలని, సాంకేతికి నైపుణ్యాలతో కూడిన విద్య తప్పనిసరి అని పేర్కొన్నారు. విద్యా విధానంలోని లోటుపాట్ల సవరణకు తొలిసారిగా విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. పేదలకు మేలు చేసే నిర్ణయాలు వేగంగా తీసుకు నేందుకే విద్యా శాఖను తనవద్ద ఉంచుకున్నానని సీఎం పేర్కొన్నారు. న్యాయ, విద్య వంటి ముఖ్యమైన శాఖలను స్వయంగా సమీక్షిస్తున్నానని, విద్యా శాఖపై ఒక ప్యాషన్ అని వివరించారు. శుక్రవారం అసెంబ్లీలో విద్యావిధానంపై జరిగిన చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. అంతకుముందు విద్యావిధానంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

బడ్జెట్‌ను రూ.7,554 కోట్లకు పెంచాం..

రాష్రంలో 28,163 ప్రభుత్వ విద్యాసంస్థల్లో 28.77 లక్షల మంది విద్యార్థులున్నా రని, 1.57 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని సీఎం చెప్పారు. ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలని,  తెలంగాణలో ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నారని వివరించా రు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో 7,857 మంది టీచర్లను నియమిస్తే, తమ ప్రభుత్వం ఏడాదిలోనే 11 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చిందని.. 10,600 మంది ఉపా ధ్యాయులకు నియామక పత్రాలు అందజేసిందని తెలిపారు.

విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచుతున్నామని.. 2023- బీఆర్‌ఎస్ రూ.19,093 కోట్లు కేటా యించగా.. మా ప్రభుత్వం 2024 -25లో రూ.21,292 కోట్లు కేటాయించిందని సీఎం వెల్లడించారు. 2025- 26 బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని రూ.23,108 కోట్లకు, 2026 -27 బడ్జెట్ లో రూ.26,647 కోట్లకు.. మూడేళ్లలో రూ.7,554 కోట్లకు పెంచినట్లు సీఎం వెల్లడించారు. జెన్ ఆల్ఫా, జెన్ బీటా తరాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని విద్యా విధానం తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు.  

నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివాదాలు సహజం

‘ప్రపంచంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్‌ను తీసుకొస్తున్నాం. కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు వివాదాలు జరుగుతాయి. అలాంటిదే పాలిటెక్నిక్ కాలేజీలకు సంబంధించిన జీవో ఎం ఎస్ నెం.97. నేను విద్యాశాఖ మంత్రిగా బా ధ్యత తీసుకున్నాక ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల సంఖ్య 86 వేలకు పెరిగింది. ప్రైవే టు విద్యా వ్యవస్థలో రెండున్నర ఏళ్లకే పిల్లలను పాఠశాలకు పంపుతుండగా.. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఐదేళ్ల నిబంధన ఉంది. అందుకే తల్లిదండ్రులు ప్రైవేటు వైపు చూస్తున్నారు.

నర్సరీ, ఎల్.కే.జీ విధానంతో పాటు ఇంగ్లిష్ భాష కోసం ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తున్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మొట్ట మొదటిసారిగా ప్రీప్రైమరీ ప్రారంభించాం. ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నాం. నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. విద్యార్థులకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నాం. డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాం.  

పాలిటెక్నిక్‌ను ప్రైవేటీకరించం 

‘పాలిటెక్నిక్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేసే ప్రసక్తే లేదు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి టాటా సహకారంతో నైణ్యం అందిస్తున్నాం. ఏటీసీలో చదివే వారికి ప్రతీ నెల 2 వేలు స్కాలర్ షిప్ అందజేయనున్నాం. మంచి సంకల్పంతో పని చేస్తుంటే  విద్యార్థుల్లో కొం దరు అపోహలు కలిగిస్తున్నారు. భూములు అమ్ముకుంటారని, ఉద్యోగాలు పోతాయని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వమే అదనంగా 282 ఎకరాల రెవెన్యూ భూమిని ఏటీసీలకు బదలాయించింది. ఒక్కో ఏటీసీపై రూ.46 కోట్లు ఖర్చు చేశాం.

సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడమే ప్రభుత్వ ఉద్దేశం. పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి, పరిశ్రమల భాగస్వా మ్యంతో ఆధునిక ల్యాబొరేటరీలు, పరికరాలు, శిక్షణ  సదుపాయాలను అభివృద్ధి చే స్తాం. విద్యార్థులకు ఇంటర్నిషిప్, అప్రెంటిషిఫ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ అవకాశాలను పెం చాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వానస్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి కొత్త రంగాలకు అనుగుణంగా కోర్సులను ఆధునీకరిస్తాం.

సాంకేతిక విద్య -నైపుణ్యాభివృద్ధి విభాగం అనుసంధానంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో  మౌలిక వసతులు, ల్యా బ్‌లు,  అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధిని మ రింత బలోపేతం చేస్తాం. విద్యార్థులలో అపోహలను తొలగిస్తాం. జీవోలో సవరణ చే స్తాం. అప్రూవల్ లేదని కొందరు అంటున్నా రు. స్కిల్స్ యూనివర్సిటీకే అప్రూవల్ తీసుకొస్తాం’ అని సీఎం రేవత్‌రెడ్డి వివరించారు. 

అధికారం పోయినా అహంకారం పోలేదు

బీఆర్‌ఎస్ అధికారం పోయినా ఆ పార్టీ నేతల్లో అహంకారం పోలేదని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘మాసబ్ ట్యాంక్ పాలి టెక్నిక్ కాలేజీలో చదువుకున్న హరీశ్ రావు.. ఇపుడు ఆ వ్యవస్థనే ముందుకు వెళ్లకుండా కుట్ర చేస్తున్నారు . పేద పిల్లలకు అన్యాయం జరగనివ్వం. దుర్మార్గం వైపు, అహంకారం వైపు ఉన్నందునే పది తలల రావణుడు కూడా రాముడి చేతిలో మరణం తప్పలేదు’ అని ముఖ్యమంత్రి విమర్శించారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్ కాంగ్రెస్ పేటెంట్   

ఫీజు రీయింబర్స్‌మెంట్ కాంగ్రెస్ పే టెంట్. గత ప్రభుత్వం రూ. 5430 కోట్ల ఫీజు బకాయిలు వదిలి వెళ్లింది. అందులో రూ.1410 కోట్లు మేం చెల్లించాం. కొత్తగా మరో రూ.1475 కోట్లు విడుదల చేశాం. 32 నెలల్లో రూ.3488 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించాం. కాలేజీలపై విజిలెన్స్ ఎంక్వైరీని అడ్డుపెట్టుకుని కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఆ రిపోర్ట్ ఏంచేశారో ఎవరికీ తెలియదు. కేసీఆర్‌కు నచ్చిన కళాశాలలకు ఫీజులు పెంచి, నచ్చని కాలేజీలను పక్కన పెట్టారు. పదేళ్లు ఫీజులు ఇవ్వకపోయినా వీళ్లు ఒక్క రోజు కూడా మాట్లాడ లేదు. ధర్నాలు చేయలేదు. నేను వచ్చాక మాత్రం నాపై ఒత్తిడి చేస్తున్నారు. కేసీఆర్ లా నేను అణచివేస్తలేననా? లేక కేసీఆరే వారిని ఉసిగొల్పుతున్నారా? జెన్యూన్ కళాశాలలకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తాం. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే నిబంధనలను పాటించాల్సిందే’ అని సీఎం రేవంత్‌రెడ్డి   

దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు

‘నేను కమీషన్లు తీసుకుంటున్న ట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఆ అవసరం నాకేంటి? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఆలోచించేలోపే పదవులన్నీ వచ్చాయి. 17 ఏళ్లలో జెడ్పీటీసీ, ఎమ్మె ల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ చీఫ్, ఇప్పుడు సీఎం అయ్యాను. నాకు డ బ్బులే కావాలంటే రియల్ ఎస్టేట్  చేసుకున్నా వస్తా యి. రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటు న్న వాళ్ల తాతను నేను. నాకు కక్కుర్తిపడాల్సిన అవసరం లేదు. నాతో ఉ న్న వాళ్లకు సహాయం చేశానే తప్ప.. ఎప్పుడు చెడు కోరుకోలేదు. నాకేం పైశాచిక కోరికలు లేవు. ప్రశాంతంగా ఉంటాను కాబట్టే రెండు నిమిషాల్లోకి నిద్రలోకి వెళ్తాను ’ అని సీఎం తెలిపారు.  

పాలు, పూలమ్మితే వందల కోట్లు వస్తాయా? 

‘ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల కోసం. యాజమాన్యాలకు కాదు. కేసీఆర్ సన్నిహితుడికి చెందిన ఒక యూనివర్సిటీ ఖాతాలో రూ.400 కోట్లపైగా డబ్బు ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? విద్య ఏమైనా వ్యాపారమా?. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా మా అధికారులను సదరు కళాశాల లోపలికి  రానివ్వలేదు. పాలమ్మి, పూలమ్మితే వందల కోట్లు వస్తాయా?. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి క్లీన్‌చిట్ వచ్చిన కళాశాలలకే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తాం.

విద్యార్థులు రాజకీయ నాయకుల ఉచ్చులో పడొద్దన్నారు. వాళ్ల పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకుంటారు. పేద విద్యార్థులకు మంచి చేస్తామంటే మాత్రం అడ్డుకుంటారట. టీషర్టు వేసుకుంటే యువకుడైపోతారా? కొందరు పుట్టుకతోనే వృద్ధులని శ్రీశ్రీ ఏనాడో చెప్పారు. తెలంగాణ ప్రజల బాధలను నా బాధగా భావించి సమస్యలు పరిష్కరిస్తున్న. కేసీఆర్, కేటీఆర్ అధికారం కోల్పోయిన బాధలో ఉన్నరు.. వాళ్ల బాధనే తెలంగాణ ప్రజల బాధ అనుకుంటున్నరు. ఫామ్‌హౌస్ కుట్రలు ఇక చెల్లవు.. తిప్పి కొట్టండి’ అని సీఎం పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు