సేవాలాల్ మహరాజ్‌ను స్మరించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
15-02-2025 03:02 PM
న్యూఢిల్లీ: బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శిగా సంత్ సేవాలాల్ మహారాజ్(Sant Sevalal Maharaj) నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కొనియాడారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి(Congress leader Rohin Reddy) పాల్గొన్నారు. ఫిబ్రవరి 15న జరగనున్న మహావీర్ సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానించారు. ఆహ్వానాన్ని అందించడానికి మంత్రి దానసరి సీతక్క(Minister Danasari Seethakka), గిరిజన సంఘాల ముఖ్య నేతలతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే.




