1 August, 2026 | 11:57 AM

కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి

01-08-2026 11:02 AM

ఇడుక్కి: కేరళవ్యాప్తంగా(Kerala) కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు(Landslide) విరిగిపడే సంఘటనలు చోటుచేసుకున్నాయి. కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా శనివారం ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో వేర్వేరుగా సంభవించిన కొండచరియల విపత్తులలో ముగ్గురు మరణించగా, పలువురు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. 

ఇడుక్కి జిల్లాలోని కుదయత్తూర్ సమీపంలోని అదూర్మల ప్రాంతానికి చెందిన సుమతి, శనివారం తెల్లవారుజామున సంభవించిన కొండచరియల విరిగిపడే ఘటనలో ఆమె ఇంటిపై శిథిలాలు పడటంతో మరణించినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. గాయపడిన ఆమె భర్త, కుమారుడిని ఇరుగుపొరుగు వారు రక్షించి తొడుపుళలోని ఆసుపత్రిలో చేర్పించారు. కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), అగ్నిమాపక, రక్షణ శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖల సిబ్బందితో కూడిన గాలింపు చర్యల అనంతరం మృతదేహలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.