19 April, 2026 | 7:51 AM

దేశ రక్షణ బాధ్యత యువతీయువకుల పైనే ఉంది: సీఎం రేవంత్

28-02-2025 03:14 PM

హైదరాబాద్: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన వైభవ్- 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ సైన్స్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు దేశరక్షణ పట్ల అవగాహన కలుగుతుందన్నారు. దేశరక్షణ బాధ్యత యువతీయువకులపైనే ఉందని రేవంత్ రెడ్డి( Revanth Reddy) స్పష్టం చేశారు. దేశరక్షణలో హైదరాబాద్ దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తోందని సీఎం వెల్లడించారు. బీడీఎల్, హెచ్ఏఎల్, మిధాని వంటి వంటి కీలక సంస్థలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాలవైపే మొగ్గు చూపుతోందని ముఖ్యమంత్రి సంప్రదాయ ఇంజినీరింగ్ విద్యపై కూడా విద్యార్థులకు అవగాహన పెంచాలని సూచించారు. జాతీయ సైన్స్ డే(National Science Day 2025) సందర్భంగా డీఆర్ డీఓ విజ్ఞాన వైభవ్ ప్రదర్శనలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Union Defense Minister Rajnath Singh) హాజరయ్యారు.