10 August, 2026 | 6:09 PM

నూతన దేవాలయ అభివృద్ధి కమిటీని సన్మానించిన సర్పంచ్

10-08-2026 05:05 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని దేవాలయాల అభివృద్ధి కమిటీ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు క్యాతం సురేష్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గంగ నర్సయ్యలను మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఘనంగా సన్మానించారు. శాలువాలతో వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మల్లాపూర్‌లోని కనకసోమేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు గ్రామంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. దేవాలయాల అభివృద్ధికి గ్రామ ప్రజలు, ప్రముఖులు సహకరించాలని కోరారు.