10 August, 2026 | 5:35 PM

ఆగస్టు15 వరకు పెన్షన్ దరఖాస్తులకు చివరి గడువు

10-08-2026 04:35 PM

బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ వెల్లడి

బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారుల నుంచి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ పొందేందుకు తమ దరఖాస్తులను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శికి లేదా మండల కార్యాలయంలో సమర్పించవచ్చని ఎంపీడీవో ఆనంద్ సూచించారు. దరఖాస్తులను సమర్పించేందుకు ఆగస్టు 15 శుక్రవారం చివరి తేదీగా పేర్కొన్నారు. అర్హులైన వారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.