29 June, 2026 | 1:20 PM

హైదరాబాద్‌లో మహిళ భద్రత కోసం స్పెషల్ డ్రైవ్

29-06-2026 12:15 PM

పోలీసుల స్పెషల్ డ్రైవ్

వందకుపైగా షాపింగ్‌ మాల్స్‌, లాడ్జీలకు పోలీసుల నోటీసులు

నగరంలో హిడెన్ కెమెరాల నివారణకు ఆదేశం

హైదరాబాద్: మహిళల భద్రత(Women Safety) కోసం హైదరాబాద్ లో పోలీసులు(Hyderabad Police) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వందకు పైగా షాపింగ్ మాల్స్, లాడ్జులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నగరంలో హిడెన్ కెమెరాల నివారణకు పోలీసులు అడ్వెజరీ జారీ చేశారు. ట్రయల్ రూమ్స్, రెస్ట్ రూమ్స్ లో గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కస్టమర్ సేఫ్టీ ఇన్ ఛార్జ్(Customer Safety In-charge)ను నియమించాలని పోలీసులు ఆదేశించారు.

హిడెన్ కెమెరాలను(Hidden cameras) గుర్తించే డిటెక్షన్ డివైస్ లు ఉపయోగించాలని తెలిపారు. క్రమం తప్పకుండా తనిఖీ చేసి రికార్డులు నిర్వహించాలని పోలీసులు ఆదేశించారు. అనుమానాస్పద పరికరాలు కనిపిస్తే తక్షణమే తమకు చెప్పాలని కోరారు. ఉద్యోగుల వెరిఫికేషన్ , సిబ్బందికి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లింఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.