15 July, 2026 | 6:40 AM

రెండో రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

04-07-2024 11:11 AM

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయల్దేరారు. గురువారం ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాని సీఎం రేవంత్, భట్టి విక్రమార్క కలవనున్నారు. సీఎం ప్రధాని మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరారు. కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధానితో భేటీ అయ్యే అవకాశముంది. రాష్ట్రానికి నిధులపై ప్రధానితో చర్చించనున్నారు.