26 May, 2026 | 11:11 AM

మళ్లీ పెరిగిన CNG ధరలు

26-05-2026 10:40 AM

న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం నాడు CNG(Compressed Natural Gas) ధరలు మరోసారి పెరిగాయి. కేజీ సీఎన్‌జీపై రూ.2 పెరిగింది. రెండు వారాల లోపే ఇంధన ధరల సవరణ జరగడం ఇది నాలుగోసారి. ఢిల్లీలో సీఎన్‌జీ  ధర రూ.83.09కి చేరింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(Indraprastha Gas Limited) ప్రకారం, సీఎన్‌జీ ధర ఇప్పుడు కిలోకు రూ. 83.09 ఉంటుంది. మే 15 నుండి ఇది నాలుగవ పెంపు. దీనితో మొత్తం పెంపు కిలోకు రూ. 4కు చేరింది. సీఎన్‌జీ ధరలలో రూ. 1 పెంపు జరిగిన కేవలం మూడు రోజులకే ఈ తాజా సవరణ అమల్లోకి వచ్చింది.

ఇదిలా ఉండగా, పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా పెరుగుతున్న ప్రపంచ ముడి చమురు ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు పెట్రోల్, డీజిల్ ధరలను సర్దుబాటు చేయడం కొనసాగించడంతో, రెండు వారాల లోపే సోమవారం నాడు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం మే నెలలోనే నాలుగు సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్యుడికి షాకిచ్చింది.