22 May, 2026 | 12:45 AM

ట్రెండింగ్‌లోకి ‘కాక్రోచ్ జనతా పార్టీ’

22-05-2026 12:00 AM

నిరుద్యోగ యువతపై సీజేఐ ‘కాక్రోచెస్’ వ్యాఖ్యల ఫలితం

న్యూఢిల్లీ, మే ౨౧: దేశంలో నిరుద్యోగ యువతను ఉద్దేశించి ‘నిరుద్యోగ బొద్దింకలు’ అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా తాజా గా ‘ఎక్స్’ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పుట్టికొచ్చింది. ఈ నెల 16న ‘ఆప్’ మాజీ రాజకీయ వ్యూహకర్త అభిజీత్ దిప్కే వ్యంగ్యపూరితంగా ఆ ఖాతాను ప్రారంభించారు. ఖాతా ప్రారంభమైన రెండు రోజు ల్లోనే, దేశవ్యాప్తంగా ౨ లక్షల మంది యువ త ఖాతాను ఫాలో అయ్యారు.

ముఖ్యంగా ఖాతాకు ‘జెన్‌జెడ్’ మద్దతు అనూహ్యంగా పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో నిఘావర్గాలు ఆ ఖాతాను తొలగించాయి. ఈ క్ర మంలో గురువారం ఉదయం ఉన్నట్టుండి మళ్లీ ‘ఎక్స్’లో సీజేపీ ఖాతా కనిపించింది. ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ పేరుతో తానే కొత్త ఖాతా ప్రారంభించానని దీప్కే ప్రకటించారు. షురూ అయిన గంటన్నర వ్యవధిలోనే ఖాతాను 16,800 మంది ఫాలో అవడం గమనార్హం. ఇక ఇన్‌స్టాగ్రాంలోనైతే.. ఈఖాతాను ఏకంగా కోటిన్నర మంది ఫాలో అయ్యారు.

ఇది దేశవ్యాప్తంగా బీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల (8.8 మిలియన్లు) కంటే చాలా ఎక్కువ. ఖాతాను ఫాలో అయిన వా రిలో ఎందరో రాజకీయ నేతలు, సినీస్టార్స్ ఉన్నారు. మరోవైపు, మీడియా తన వ్యాఖ్యలను తప్పుగా ప్రసారం చేసిందని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.