4 May, 2026 | 3:23 PM

Breaking News

తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •  

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి

04-03-2026 02:57 PM

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆలేరు,(విజయక్రాంతి): బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరి లో గల మీనానగర్ లో బాలసదనం ను  జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి  ఆకస్మిక తనిఖీ చేశారు. బాలసదనంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారని,అటెండన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, విద్యార్థులు ఏ ఏ తరగతులు చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు.

బాలసదనంలో ఉన్న పిల్లలతో కలెక్టర్ ముచ్చటించి, రుచి కరమైన భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకొని, విద్యార్థులను  మీకు ఏమి అయినా కావాలా అని అడగగా పిల్లలు మ్యూజిక్ టీచర్ కావాలని తెలుపగా  పిల్లల కోరిక మేరకు మ్యూజిక్  టీచర్ ను తాత్కాలికంగా నియమించాలని  సంబంధిత అధికారులను అదేశించారు. విద్యార్థులందరికీ హెల్త్ ప్రొఫైల్  ఉందా అని అడిగి తెలుసుకున్నారు.

బాలసదనం లో వాటర్ ఫిల్టర్ పనిచేయడం లేదని తెలపడంతో  వెంటనే మరమ్మతులు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బెడ్ షీట్ లు సరిగా లేకపోవడంతో కొత్త బెడ్ షీట్లు ఇవ్వాలని సూచించారు. అనంతరం  నిర్మాణంలో ఉన్న బాలసదనం భవనం  యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో  జిల్లా సంక్షేమ అధికారి నరసింహ రావు. మున్సిపల్ కమిషనర్ రామలింగం భువనగిరి తహసీల్దార్ జగన్ మోహన్ ప్రసాద్. బీఆర్బీ కో ఆర్డినేటర్ అనంత లక్ష్మీ, యశోద,బాలసదన్ సిబ్బంది.పిల్లలు.తదితరులు పాల్గొన్నారు.