మెరుగైన వైద్య సేవలు అందించాలి

06-10-2026 | 05:05pm

జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కె.హరిత(Collector Haritha) సూచించారు. మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన ఆమె వివిధ వార్డుల్లో రోగులతో మాట్లాడి వైద్యం, మందులు, అల్పాహారం, భోజనం అందుతున్న తీరును తెలుసుకున్నారు.

వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. రోగులు, సహాయకులకు నాణ్యమైన ఆహారం అందించాలని, క్యాంటీన్‌ను పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు కిరణ్, వైద్యులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు