11 March, 2026 | 3:22 AM

ప్రజా వాణిలో వచ్చిన ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

09-03-2026 05:16 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని  కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఎం.డెవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రజావాణిలో వచ్చిన ప్రతి ధరఖాస్తును క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం అర్జిదారుల నుండి ధరఖాస్తులను స్వీకరించారు. వాంకిడి మండలoలోని జైత్ పూర్ గ్రామానికి చెందిన కోట సరిత తనకు దివ్యాంగ పించను మంజూరి కొరకు ధరఖాస్తు సమర్పించినారు. రెబ్బెన మండలం వoకులం గ్రామానికి చెందిన జక్కుల శంకరమ్మ తనకు ఏదైనా ఉపాది కల్పించాలని దరఖాస్తు. ఆసిఫాబాద్ మండలం యీదులవాడ గ్రామానికి చెందిన యటకారి మల్లేష్  పత్తి పంట నష్ట పోయీనందున పరిహారము ఇప్పించుట గురించి. సిర్పూర్ (టి) మండల కేంద్రానికి చెందిన మహాల్కార్ రవి తాను ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్నందున లావుని పట్టా మంజూరి గురించి. పెంచికల పేట్ మండలం పోతేపల్లి గ్రామ సర్పంచ్ దుర్గం పోషన్న తమ గ్రామములో త్రాగు నీటి సమస్యను పరిష్కరించాలని దరఖాస్తు.

జైనూర్ మండలం అశపల్లి గ్రామానికి చెందిన రాధోడ్ హరి తన వ్యవసాయ చేనులో గల సాగు నీటి బావి కూలిపోయినందున మరమ్మత్తు చేయడానికి నిధులు మంజూరు చేయాలని దరఖాస్తు. ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన కోలే భిక్కాజి ఇతర డాటా ఎంట్రి ఆపరేటర్లు ప్రభుత్వం చేపట్టిన కుల ఘనన సర్వే వివరాలను ఆన్లైన్ చేసిన డబ్బులు చెల్లించాలని దరఖాస్తు చేసుకున్నారు. సిర్పూర్ టి మండలం జైభీం నగర్ కు  చెందిన డోoగ్రి తులసిరాం తమ తండ్రి గారి నుండి వారసత్వంగా వస్తున్న భూమిని పట్టా చేయుట గురించి దరఖాస్తు సమర్పించినారు.