22 August, 2026 | 4:13 PM

సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన

01-07-2026 07:59 PM

కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ చొరవతో కల్వర్ట్, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సందీప్ నగర్ కాలనీలో నెలకొన్న కల్వర్ట్ నిర్మాణం, తాగునీటి సమస్యలపై మున్సిపల్ కమిషనర్ అంజయ్య స్పందించారు. స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ చొరవతో అధికారులు కాలనీని సందర్శించి సమస్యలను పరిశీలించారు. ఇటీవల కాలనీ ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా కౌన్సిలర్ రాపర్తి కార్తీక్‌కు తెలియజేయగా, ఆయన వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి సమస్యల వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ స్వయంగా సందీప్ నగర్ కాలనీని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. కల్వర్ట్ నిర్మాణం అవసరం, తాగునీటి కొరత వంటి ప్రధాన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించిన కమిషనర్, వీలైనంత త్వరగా అవసరమైన పనులు చేపట్టి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.