‘కమ్యూనిటీ ఛాంపియన్స్’

28-09-2026 | 05:15am

కమ్యూనిటీ హెల్త్ ప్రివిలేజ్ కార్డు ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాం తి): నివాస ప్రాంతాల అభివృద్ధి, భద్రత, సంక్షేమం కోసం సేవలందిస్తున్న కమ్యూనిటీ నాయకుల సేవలకు గుర్తింపుగా కామినేని హాస్పిట ల్స్(Kamineni Hospitals) ఆధ్వర్యంలో ‘కామినేని కమ్యూనిటీ ఛాంపియన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని 50కిపైగా గేటెడ్, రెసిడెన్షియల్ కమ్యూనిటీలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఆయా కమ్యూనిటీల అధ్యక్షులు, కార్యదర్శులను సన్మానించారు.

కమ్యూనిటీల్లో రోజువారీ సమస్యల పరిష్కారం, అవసరమైన సేవల సమన్వయం, వసతుల నిర్వహణతో పాటు నివాసితుల మధ్య సమన్వయం, వారి ఆరోగ్యం కోసం అధ్యక్షులు, కార్యదర్శు లు కీలకంగా పనిచేస్తున్నారు. వారి సేవలను గుర్తించి అభినందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘మీరు మీ కమ్యూనిటీ కోసం శ్రద్ధ తీసుకుంటున్నారు.. కమ్యూనిటీ ఆరోగ్యం కోసం మేము శ్రద్ధ తీసుకుంటాం’ అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ప్రివిలేజ్ కార్డును ప్రారంభించారు.

కమ్యూనిటీలలో ఉండేవారికి, వారి కుటుంబ సభ్యులకు ఎంపిక చేసిన ఓపీ కన్సల్టేషన్లు, డయాగ్నస్టిక్ సేవలు, ఇన్‌పేషెంట్ సేవలు తదితర ఆరోగ్య సేవల్లో ప్రత్యేక ప్రయోజనాలు అందించనున్నారు. సుమారు 150 మంది కమ్యూనిటీ ప్రతినిధులు, అతిథులు హాజరయ్యారు. కామినేని హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డా. గా యత్రి కామినేని, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. గోకుల్ రఘురామ్, సత్యనారాయణ ఏఆర్‌ఎ స్తో పాటు పలువురు సీనియర్ సభ్యులు పాల్గొన్నారు. ప్రతినిధులతో కామినేని హాస్పిటల్స్ బృందం నివారణ ఆరోగ్య సేవలు, ఆరోగ్య అవగాహనలు, స్క్రీనింగ్ క్యాంపులు, అత్యవసర వైద్య సహాయం తదితర అంశాలపై చర్చించారు. 

మరిన్ని వార్తలు