భార్య సర్పంచ్.. భర్త పెత్తనం
బాధ్యతలను విస్మరిస్తున్నారని ఎంపీడీవో కు ఫిర్యాదు
హన్వాడ, మార్చి ౧౦ : గ్రామ సర్పంచ్ గా గెలిచి ఊర్లో ఉండకుండా భర్త పెద్దతనం చేస్తూ ఇష్టానుసారంగా వివరిస్తున్నారని ఎం పీడీవోకు పెద్దదర్పల్లి గ్రామ వార్డు సభ్యు లు, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కో ఆప్షన్ మెంబర్గా సర్పంచ్ భర్త పేపర్లలో కూడా రాపించుకుంటున్నారని, పంచాయతీ కార్యదర్శి నిబంధనలు అమలు చేయాలని చెబితే అతని గ్రామం నుంచి వెళ్లిపోవాలని అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఎంపీడీవో దృష్టికి తీసుకువచ్చారు.
సర్పంచ్ హైదరాబాద్ లో ఉంటారని భర్త ఊర్లో ఉండి రా జకీయం చేస్తున్నారని, వారం లో ఒకటి, రెం డు రోజులు తప్ప గ్రామంలో ఉండడం లేద ని వారు పేర్కొన్నారు. నిబంధనల మేరకు పంచాయతీ కార్యదర్శి నడుచుకుంటున్నారని ఇందులో ఎలాంటి సందేహం లేదని వారు చేసిన ఫిర్యాదులు పేర్కొన్నారు. గ్రా మంలోని బుకీ వరలక్ష్మి కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈ విషయంపై పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ చేసి చర్యలు తీసు కోవాలని వారు ఎంపీటీవో దృష్టికి తీసుకువచ్చారు.




