పోలీస్ ప్రజావాణికి 36 ఫిర్యాదులు
28-09-2026 | 08:50pm
నిజామాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం(Nizamabad District Police Headquarters)లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 36 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకునేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్లో సిఐలు ఎస్ఐలతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు ఇలాంటి పైరవీలు మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులు సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సిపి కోరారు. ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరించి పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.