20 May, 2026 | 3:45 AM

‘పురుషః’తో పూర్తి వినోదం

20-05-2026 01:20 AM

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా ‘పురుషః’. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో పవన్‌కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఇంకా ఇందులో సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రా యంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్యపాత్రలను పోషించారు. మే 22న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెం ట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరోయిన్ తేజస్వీ రావ్ మాట్లాడుతూ.. “మే 22న ఈ సినిమాను అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేయండి” అని కోరారు. చిత్ర కథానాయకుడు బత్తుల పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. “అసలే ఈ వేసవిలో అందరూ ఇంట్లోనే ఉంటారు.

కుటుంబమంతా కలిసి థియేటర్‌కు వెళ్లి హాయిగా చూసేలా మా సినిమా ఉంటుంది. అందరూ ఫుల్‌గా ఎంటర్‌టైన్ అవుతారు” అన్నారు. కథానాయకి రాయంచ కొక్కుర మాట్లాడుతూ.. “నన్ను నమ్మి పురుషః’లో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన నిర్మాత కోటేశ్వరరావుకు థాంక్స్‌” అని తెలిపింది. ‘మే 22న మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయా లని కోరుకుంటున్నాన’ని దర్శకుడు వీరు చెప్పారు. నిర్మాత కోటేశ్వరరావు మాట్లాడుతూ.. “మా సినిమా మే 22న రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి” అన్నారు. మరో నిర్మాత సరస్వతి బత్తుల మాట్లాడుతూ.. “కాలేజీ టైమ్‌లో స్టోరీలు రాసుకునేదాన్ని, డైరెక్టర్ అవ్వాలని అనుకునేదాన్ని. మా సినిమా కచ్చితంగా అందరికి వినోదం పంచుతుంది” అని తెలిపారు.  మిగతా చిత్రబృందం కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.