29 July, 2026 | 11:20 AM

Breaking News

పెరిగిన రూపాయి విలువ.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు   •   లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ధర్నా   •   రన్నింగ్ కారులో మంటలు.. తప్పిన పెద్ద ప్రమాదం   •   ఇల్లందు అభివృద్ధిపై పొంగులేటితో ఎమ్మెల్యే కోరం కనకయ్య చర్చ   •   గిరి ప్రదక్షిణ లో పాల్గొన్న మంత్రులు   •   మావోయిస్టు అగ్రనేత మిసిర్ బెస్రా అరెస్ట్   •   నవీపేట రైల్వే స్టేషన్‌కు కొత్త రైల్వే ప్లవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి   •   పొంగి పొర్లుతున్న నల్లవాగు మత్తడి   •   సీనియర్ జర్నలిస్ట్ రామ్‌ కుమార్‌ను పరామర్శించిన మంథని మీడియా ప్రెస్ క్లబ్   •   బూర్గంపాడు పంచాయతీ కార్యాలయంలో డీపీవో ఆకస్మిక తనిఖీ   •  

ప్రతీ హీరో నుంచి వరుస సినిమాలు రావాలి

20-05-2026 01:22 AM

టాలీవుడ్ రా కింగ్ మనోజ్ మంచు తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే.. “ప్రతీ హీరో నుంచి కంటిన్యూగా సినిమాలు రావాలని కోరుకుంటున్నా. నేను కూడా వరుసపెట్టి చిత్రాలు చేయాలనే ప్లానింగ్‌లోనే ఉన్నాను. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా. ఇప్పుడు నా చేతిలో ఐదారు ప్రాజెక్టులున్నాయి. వాటికి సంబంధించిన అనౌన్స్‌మెంట్లు ఈ నెలలోనే వస్తాయి.

జూన్ 7న నా కొత్త సినిమా ‘రక్షక్’ ప్రారంభం కాబోతోంది. అందులో నేను డీసీపీగా పాత్రను పోషిస్తున్నా. ‘డేవిడ్ రెడ్డి’ షూటింగ్ దాదాపు 40 శాతం పూర్తయింది. మే 20 సాయంత్రం గ్లింప్స్ రాబోతోంది. అన్ని రకాల పాత్రల్ని చేయాలనుకుంటున్నా. మౌనిక ‘నమస్తే వరల్డ్’ టాయ్స్ గురించి పని చేస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తారు. ‘ఐక్య ధైర్య సేనా సమితి’ ట్రస్ట్ మాకు ఓ బిడ్డ లాంటిదే. ‘ఐక్య’కి ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. దీనికి సంబంధించి నియమాల్ని ఇంకా రూపొందించ లేదు.. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాం. కావాల్సిన నిధి కోసం ఫండ్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం” అని తెలిపారు.