11-02-2026 01:53:20 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఫిబ్రవరి 10 : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ మంగళ వారం రాత్రి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కె గంగాధర్, జిల్లా విద్యాధికారి యాదయ్యలతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఈ నెల 12న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కు కేటాయించిన కౌంటింగ్ సిబ్బంది
కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో, బెల్లంపల్లి, క్యాతనపల్లి, చెన్నూర్, లక్షెట్టిపేట మున్సిపాలిటీలకు కేటాయించిన కౌంటింగ్ సిబ్బంది ఆయా మున్సిపల్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని, ఈ నెల 13న మున్సిపల్ కార్పొరేషన్, ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలకు సకాలంలో హాజరై విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.