ఖానాపూర్ లో కాంగ్రెస్ వెయ్యి రోజుల పండగ
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు ఆ పార్టీ పాలన వెయ్యి రోజుల పండుగ ఘనంగా జరుపుకున్నారు. పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద బాణాసంచా, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు జంగిలి శంకర్ మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ పథకాల(Welfare schemes) వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్రంలో 1000 రోజుల్లో పార్టీ అనేక సంక్షేమ పథకాలు చేసి ప్రజలకు మరింత చేరువ అయిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం, కౌన్సిలర్లు నిమ్మల రమేష్ ,ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం ,పట్టణ అధ్యక్షులు గొర్రె గంగాధర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, జన్నారపు శంకర్, షబ్బీర్ పాష, గంగ నరసయ్య, అమనుల ఖాన్ ,కావలి సంతోష్, రాజేందర్ ,నయీమ్ ,మధిర సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.






