విజయం కంటే వైఫల్యమే ఎక్కువ నేర్పిస్తుంది
04-09-2026 | 05:19pm
గీతం హైదరాబాద్ టెడ్ఎక్స్ లో అతిథుల ఉద్ఘాటన
పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం (Geetam Deemed University) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న నిర్వహించిన స్వతంత్ర టెడ్ఎక్స్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమైన ఆలోచనలు, కథల ద్వారా ‘స్థైర్యం, ఎదుగుదలను’ చాటిచెప్పింది. విజయం కంటే వైఫల్యమే జీవితానుభవాలను నేర్పిస్తుంది స్పష్టీకరించింది. దాదాపు వంద మంది ఔత్సాహిక విద్యార్థులను(Students) ఒకచోట చేర్చి, వారిలో సవాళ్లను స్వీకరించి, పరిష్కరించగలిగే స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సవాళ్లను ఎదుర్కోవడం, మార్పును స్వీకరించడం, అర్థవంతమైన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలను సాధించడం వంటి అంశాలపై విభిన్న స్వరాలు, దృక్కోణాలు వెల్లడయ్యాయి.






