తాతా మధు వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ధర్నా
12-09-2026 | 06:02pm
స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్
హత్నూర: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Speaker Gaddam Prasad Kumar)పై ఎమ్మెల్సీ తాతా మధు(MLC Tata Madhu) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నాయకులు శనివారం దౌల్తాబాద్ చౌరస్తాలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. తాతా మధును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, స్పీకర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్సీ కులాల ప్రస్తావనతో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. తాతా మధు తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కోరారు.