మంత్రివర్గంలో కాంగ్రెస్‌కు చోటు
59 ఏళ్ల తర్వాత కేబినేట్‌లోకి..
నేడు విజయ్ మంత్రివర్గం విస్తరణ
చెన్నై, మే 20: తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక కీలక పరిమాణం చోటు చేసుకోబోతుంది. దాదాపు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి వర్గంలో భాగస్వామి కాబోతోంది. తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు చోటు దక్కించుకున్నారు.
ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇద్దరు రాజేష్‌కుమార్, పీ విశ్వనాథ్‌లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంగీకారం తెలిపినట్లు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నా రు. 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరడం చరిత్రాత్మక ఘటమని తెలిపారు.






