ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
బిఆర్ఎస్ మండల నాయకులు కరుణాకర్ రెడ్డి
గణపురం,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని బీఆర్‌ఎస్ పార్టీ గణపురం మండల మాజీ అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశాలతో బుధవారం గణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు రూ.2,500, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతు భరోసా తదితర హామీలను అమలు చేయలేదని విమర్శించారు.
ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పరశురాంపల్లి సర్పంచ్ ఉడత సాంబయ్య యాదవ్, మాజీ పిఎస్ఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్లు తోట మానస శ్రీనివాస్, కట్ల ప్రశాంతి శంకరయ్య, మాజీ ఎంపిటిసి దాసరి రవీందర్, నాయకులు ఎస్ కె హఫీజ్, మామిండ్ల సాంబయ్య, వీసం భరత్ రెడ్డి, పబ్బ రవి, కర్రే ప్రవీణ్, అల్లూరి శ్రీను, గాజర్ల చింటూ గౌడ్, బోట్ల స్వామి, పాశికంటి రామకృష్ణ, పోతుల విజేందర్, బండారి కిరణ్, బండారి రమేష్, తాళ్లపల్లి సాయి, వాజిద్, రత్న నవీన్, దాసరి నగేష్ తదితరులు పాల్గొన్నారు.






