2 September, 2026 | 5:01 PM

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

02-09-2026 | 04:22pm

సత్తుపల్లి.సెప్టెంబర్ 2.(విజయ క్రాంతి): మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత, స్వర్గీయ  వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని,మున్సిపల్ ఆఫీస్ వద్ద  డాక్టర్ వైయస్సార్ విగ్రహంకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు  డాక్టర్  మట్టా రాగమయి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ  కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, సత్తుపల్లి ఏఎంసి  చైర్మన్ దోమ ఆనంద్,సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, NSUI అధ్యక్షులు సందీప్ గౌడ్,కౌన్సిలర్స్, సర్పంచులు, ఉపసర్పంచ్ లు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ లు, యూత్, NSUI నాయకులు, వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.