‘సర్’పై కాంగ్రెస్ రాద్ధాంతం

26-09-2026 | 05:05am
  1. దొంగేదొంగ అన్నట్లుంది ఆ పార్టీ తీరు
  2. రాజ్యాంగ వ్యవస్థలపై రాహుల్‌గాంధీకి నమ్మకం లేదు
  3. కాంగ్రెస్ వైఖరిని దేశం గమనిస్తుంది
  4. బీజేపీ ఎంపీ డా.కే.లక్ష్మణ్  

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India), ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) విషయంలో కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డా. కె. లక్ష్మణ్(MP Dr. K. Laxman) మండిపడ్డారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం రాజ్యాంగ సంస్థలను పావులుగా వాడుకున్న ఉదంతాలతోనే నిండి ఉందని, అలాంటి పార్టీ ‘సర్’ ప్రక్రియను తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరించిన నవీన్ చావ్లా శైలిని, ఆ సమయంలో ఢిల్లీలో జరిగిన అకృత్యాలు, దౌర్జన్యాలు, బలవంతపు కుటుంబ నియంత్రణ అమలులో ఆయన పాత్రను సాక్షాత్తూ ‘షా కమిషన్’ తప్పుబట్టిందని లక్ష్మణ్ గుర్తుచేశారు.  తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నవీ న్‌చావ్లాను ఇందిరాగాంధీ హయాంలో ఎన్నికల కమిషర్‌గా నియమించారని, అప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గోపాలస్వామి సైతం ఆయనపై 12 అభియోగాలు మోపి తప్పుబట్టిన విషయం దేశ ప్రజలందరికీ తెలుసన్నారు.

రాజకీయ అవసరాల కోసం ఎన్నికల సంఘం అధికారాలను దుర్వినియోగం చేసి న చరిత్ర కాంగ్రెస్‌దేనని స్పష్టం చేశారు. రా హుల్‌గాంధీకి రాజ్యాంగ సంస్థలు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై ఏమాత్రం గౌరవం లేదని, తమకు ప్రతికూలంగా తీర్పు లు వస్తే రాజ్యాంగ సంస్థలను కించపరిచేలా మాట్లాడటం ఆయనకు అలవాటుగా మా రిందని ఆరోపించా రు. బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఎంపీగా పోటీ చేయించిన అనైతిక చరిత్ర కాంగ్రెస్‌దని ధ్వజమెత్తారు.

చివికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి, అనర్హత వేటు వేస్తే తప్ప.. తప్పును సరిదిద్దుకో లేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు. రాహుల్‌గాంధీ ఒకవైపు దిగజారుడు రాజకీయాలు చేస్తూ, మరోవైపు రాజ్యాంగం గురిం చి, విలువల గురించి నీతులు మాట్లాడటం విడ్దూరంగా ఉందన్నారు. 

వరుసగా మూడుసార్లు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల ఆశీస్సు లతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ని, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షాను దేశద్రోహులని వ్యాఖ్యానించడం ఆయన మాన సిక స్థితికి నిదర్శనమన్నారు. వరుస పరాజయాల భయంతో, అధికారం దక్కలేదన్న తీవ్ర ఆక్రోశంతోనే రాహుల్‌గాంధీ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భారత ప్రజాస్వామ్య ప్రక్రియను, వ్యవస్థలను ఎంతగా అపహాస్యం చేయాలని చూసినా దేశ ప్రజలు సహించబోరని, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు