2 September, 2026 | 5:25 PM

వైఎస్సార్‌కు కాంగ్రెస్ నేతల ఘన నివాళి

02-09-2026 | 03:42pm

టేకులపల్లి, (విజయక్రాంతి): దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం బోడ్ రోడ్ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలే ప్రసాదరావు, ఖాదర్ బాబు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్కినేని శ్యాంబాబు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఈది గణేష్, బుర్ర ధర్మయ్య గౌడ్, మోకాళ్ళ పోశాలు, సర్దార్ నాయక్, రవికుమార్ నాయక్, రాస మల్ల నరసయ్య, ఇస్లావత్ రెడ్యా నాయక్, గాడిపెళ్లి రాములు గౌడ్, లావుడియా సురేష్ నాయక్, బొమ్మర్ల శ్రీనివాస్ గౌడ్, యాసారపు సత్యసాయి గౌడ్, ధరావత్ హరినాయక్ తదితరులు పాల్గొన్నారు.