2 September, 2026 | 4:19 PM

బెల్లంపల్లిలో బీఆర్ఎస్ ధర్నా

02-09-2026 | 03:36pm

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చనoదుకు నిరసనగా బెల్లంపల్లి లో బిఆర్ ఎస్ మహా మహాధర్నా చేశారు. కంటా అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ తీర్చలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాడుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు బత్తుల సుదర్శన్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.