31-08-2025 06:35:24 PM
నిర్మల్,(విజయక్రాంతి): దేశ ప్రధాని నరేంద్ర మోడీపై మాతృమూర్తి పై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వాక్యాలను నివసిస్తూ బిజెపి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ సుంకరి సాయి, మండల అధ్యక్షులు ఏనుగు వెంకట రెడ్డి కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.