31-08-2025 06:32:11 PM
కోదాడ: కోదాడ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ టాక్స్ స్టాండ్ యూనియన్ అధ్యక్షుడిగా రెడ్డబోయిన ప్రశాంత్ గెలుపొందారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికలలో మొత్తం పోలింగ్ అయిన ఓట్లు 151 కాగా ప్రత్యర్థి పై 21 ఓట్ల మెజారిటీతో ప్రశాంత్ గెలుపొందారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రతి సభ్యుడికి రుణపడి ఉంటానని అన్నారు. యూనియన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం అధ్యక్షుడిగా గెలుపొందిన ప్రశాంత్ కు యూనియన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.