calender_icon.png 13 February, 2026 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

13-02-2026 05:04:59 PM

సుల్తానాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది, మున్సిపాలిటీ నీ కైవసం చేసుకుంది... ఈ సందర్భంగా శుక్రవారం కౌంటింగ్ అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరిపారు, స్వర్గీయ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కుమారుడు బిరుదు రాధాకృష్ణ  నాలుగో వార్డ్ నుండి విజయం సాధించారు.

ఈ సందర్భం గా మున్సిపల్ కార్యాలయం ఎదుట గల బిరుదు రాజమల్లు విగ్రహానికి కుమారుడు కృష్ణ తో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు, విజయం సాధించిన బిరుదు  కృష్ణ సమత దంపతులను పూలమాలలతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు... ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.