13 March, 2026 | 5:49 PM

యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం

13-03-2026 05:04 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు అవార్డు కౌన్సిలర్ వర ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా 7వ వార్డు కౌన్సిలర్ ఉట్లా వరప్రదీప్ ఆధ్వర్యంలో శుక్రవారం యాదవ సంఘం కుల పెద్దలతో పాటు సంబంధిత ఏఈతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన బిల్డింగ్ అంచనాలు, నిర్మాణ విధానం, స్థల పరిశీలన తదితర అంశాలపై సవివరంగా చర్చించారు.

త్వరలోనే పనులు ప్రారంభించి యాదవ కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా హాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉట్లా వరప్రదీప్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు కావడం ఆనందకరమని తెలిపారు. ఈ హాల్ ద్వారా యాదవ సంఘానికి చెందిన ప్రజలు వివిధ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సౌకర్యం కలుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కుల పెద్దలు, స్థానిక నాయకులు,  అధికారులు పాల్గొన్నారు.