12 August, 2026 | 12:59 PM

జడ్పీహెచ్‌ఎస్, జూనియర్ కళాశాల పనులు వేగవంతం చేయాలి

12-08-2026 11:49 AM

వనపర్తి, (విజయక్రాంతి): వనపర్తి జడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా బేస్ పనులు పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత అంచనాల మేరకు పనులు చేపట్టాలని సూచించారు. పనుల పురోగతికి స్పష్టమైన కార్యాచరణ షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు.