22 May, 2026 | 1:35 AM

చల్లచల్లని ప్రయాణం

20-04-2024 02:10 AM

వేసవిలో మెట్రోపై మక్కువ

ఒక్కరోజే 4.85లక్షల మంది ప్రయాణం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మహానగరంలో ఎండలు మండిపోతుండటంతో జనం అత్యవసర సమయాల్లో బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఎండధాటికి వాహనాలను ఆశ్రయించడం కంటే మెట్రోలో ప్రయాణించడమే మేలని జనం వాపోతున్నారు. మెట్రోలో ప్రయాణం చేయడం వల్ల గమ్యస్థానానికి తొందరగా చేరుకోవడంతో పాటు ఎండ నుంచి కాపాడుకోవచ్చని ప్రయాణికులు ఎక్కువగా మెట్రోలో ప్రయాణిస్తున్నా రు. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదుకావడంతో జనం ఎండధా టికి ఇంటికే పరిమితం అవుతున్నారు. అయి తే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే.. ఆర్టీసీ బస్సుల కంటే అధిక సంఖ్యలో మెట్రోను ఆశ్రయిస్తున్నారని ఎల్‌అండ్‌టీ తెలిపింది. సాధారణ రోజుల్లో మెట్రోలో 4.80లక్షల నుంచి 5లక్షల మంది వరకు ప్రయాణం చేస్తున్నారు. వేసవికావడంతో సాధారణ కంటే 5లక్షల మంది ఎక్కువ ప్రయాణిస్తున్నారు. ప్రస్తుత వేసవిలో ప్రయాణికుల సంఖ్య దాదాపు ఒక్కోరోజు 50 వేల నుంచి లక్ష వరకు పెరిగిందని ఎల్‌అండ్‌టీ పీఆర్వో నరేంద్రనాథ్ శుక్రవారం చెప్పారు. ఏప్రిల్ 18న 4.85లక్షల మందికి పైగా ప్రయాణం చేయగా గతేడాది ఇదే రోజు 4.80లక్షల మంది ప్రయాణం చేసినట్టు వెల్లడించారు. 

మెట్రోపై మహాలక్ష్మిపథకం ప్రభావం

@ నరేంద్రనాథ్, పీఆర్వో (ఎల్‌అండ్‌టీ)

ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మిపథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహాలక్ష్మి పథకం వచ్చిన దగ్గర నుంచి మెట్రోలో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇదే విషయం మెట్రోపై తీవ్ర ప్రభా వం పడింది. అయితే స్త్రీ, పురుషుల నిష్పత్తి ఆధారంగా లెక్కలు తీయాల్సి ఉంటుంది. చాలా మంది మీడియాలో సంఖ్యలతో సహా ప్రచురించారు. ఆ సంఖ్యలకు ఎల్‌అండ్‌టీ మైట్రోరైలుకి ఎలాంటి సంబంధం లేదు. మెట్రోలో ఉచిత ప్రయాణం లేనందువల్ల మహిళలు ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు.