22 May, 2026 | 2:38 AM

సీపీఎం నాయకులతో భట్టి భేటీ

20-04-2024 02:08 AM

n పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేయడంపై మంతనాలు 

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి ): పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఎం నాయకులను కోరారు. శుక్రవారం సీపీఎం కార్యాలయానికి వెళ్లిన ఆయన.. ఆ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్యతో మంతనాలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని లౌకికవాద పార్టీలు ఇండియా కూటమితో కలిసి పనిచేస్తూ లౌకికవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతగా వారికి అన్ని విషయాలు వివరించానని, వారు కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారని తెలిపారు. వాటిని పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని వెల్లడించారు.