21 April, 2026 | 6:32 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

గోవులను నదులతో సమానంగా గౌరవించాలి

21-04-2026 05:25 PM

మధిర,(విజయ క్రాంతి): గోవులను నదులతో సమానంగా గౌరవించాలని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి రామిశెట్టి నాగేశ్వరావు అన్నారు. మంగళవారం మధిర పట్టణంలోని తాహసిల్దార్ కార్యాలయం ప్రాంగణంలో సమస్త గో ప్రేమిక జన సందోహాలకు ఆరాధన గో ప్రచార ఉద్యమం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.....గోవును దేశమాతగా ఆరాధ్యనీయ దేశ దేవతగా దేశ ఔన్నత్యానికి చిహ్నంగా గౌరవించబడవలెను.

భారతదేశంలో సంపూర్ణ గోహత్య నివారణ గల ప్రతిబంధకాలు గోహత్యను రూపుమాపుట ఇందులో దేశి గో వంశ సంరక్షణ గో సేవ కొరకు కేంద్ర చట్టమును గో సేవ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయవలెను.  గో పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసి వేద లక్షణాలు కలిగి ఉన్న గో ఆధారిత పంచగవ్య ఆత్పాదనల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. 27 ఏప్రిల్ 2026న దేశవ్యాప్తంగా తాహసిల్దార్ మండల అధికారి జిల్లా కలెక్టర్ ద్వారా మన ప్రియతమ రాష్ట్రపతి, ప్రధానమంత్రి , గవర్నర్ , ముఖ్యమంత్రి లకు వినతి పత్రాలు అందజేశారు.